Home వైద్యం *భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం

*భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం

93
0

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం. సహజ మరణం తర్వాత అవయవదానం!
– దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ
– ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత
– ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం
– గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ
– బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త శకం

సాధారణంగా మన దేశంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. అంటే, మెదడు పనిచేయడం ఆగిపోయినా గుండె కొట్టుకుంటున్న వారి నుంచే అవయవదానానికి చట్టపరమైన అనుమతి ఉంది. కానీ, ఢిల్లీ వైద్యులు ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా సహజ మరణం తర్వాత కూడా అవయవాలను సేకరించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.