పర్చూరు : కూటమి ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని అన్నారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఒక వ్యక్తి కోసం నిరంకుశ పాలన చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను వైసీపీ దుర్వినియోగం చేసిందని అన్నారు. గత వైసీపీ సర్కారు రూ.1.35లక్షల కోట్లు బకాయిలు పెట్టిందని చెప్పారు. ఛిద్రమైన ఆర్ధిక వ్యవస్థను పట్టా లెక్కించడం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఎన్నికల హామీల అమలుకు అద్దం పట్టే బడ్జెట్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం మేళవింపుకు ప్రతిబింబం కూటమి ప్రభుత్వ బడ్జెట్ అన్నారు. సిఎం చంద్రబాబు ఆలోచనల మేరకు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రానికి వెన్నెముక వ్యవసాయం అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇచ్చిందని అన్నారు. పంటల సాగులో అధునాతన టెక్నాలజీపై రైతులకు ప్రోత్సాహం, విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు సబ్సీడీపై ఇస్తున్నట్లు తెలిపారు.