వేటపాలెం : రామన్నపేట పంచాయితీ రావూరిపేట గ్రామం నందు చుండూరు ఆదిశేషమ్మ ప్రాథమిక పాఠశాల నందు నిర్మాణాన్ని పూర్తి చేసిన పనులను శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, తెలుగుదేశం అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం 7వ పౌష్టికాహార పక్షోత్సవాల్లో పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.