Home బాపట్ల దివ్యాంగునికి వీల్‌ఛైర్‌ బహుకరణ

దివ్యాంగునికి వీల్‌ఛైర్‌ బహుకరణ

7
0

చిన్నగంజాం : మండలంలోని గోనపూడికి చెందిన భీమవరపు మాధవికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉననారు. వారిలో కుమారుడు భీమవరపు మణిదీప్ వికలాంగుడు. తను కదల లేని స్థితిలో ఉన్నాడని, కనీసం ఆకలేస్తే అన్నమని కూడా అడగలేడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలి ముద్రలు పడకపోవటంతో తనకి ప్రభుత్వం ద్వారా పింఛన్ అందటం లేదని తెలిపారు. ఇలాంటి మానసిక వికలాంగుల పిల్లలు పుట్టడం చూసి భర్త ఇంటిని వదిలి వెళ్ళిపోయాడని, తాను ఒంటరిగా ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబం పోషిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికెళ్ళినా కుమారుడిని మోసుకుని వెళ్లటంతో వెన్నపూస దెబ్బతిని తన పరిస్థితి ఇబ్బందిగా ఉందని, తన దీన పరిస్థితి తెలుసుకున్న సూర్యా శ్రీ ట్రస్ట్ సెక్రటరీ ఎస్‌కె సర్దార్ భాష దాతలు, ప్రవాస భారతీయులైన శివాజిరెడ్డి, నిర్మల సహకారంతో రూ.32వేల వీల్ చైరు అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆ తల్లికి ప్రతినెలా రూ.5వేలు పింఛన్ అందజేస్తున్నట్లు షేక్‌ సర్దార్ భాష తెలిపారు.