Home బాపట్ల  ట్రావెల్స్ బస్సుల తనిఖీలు

 ట్రావెల్స్ బస్సుల తనిఖీలు

35
0

ట్రావెల్స్ బస్సుల తనిఖీలు*

బాపట్ల:

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల భద్రతకు ముఖ్య ప్రాధాన్యతనివ్వాలని నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను జిల్లా పోలీస్ అధికారులు తనిఖీ చేసి వాటి పత్రాలను, ప్రయాణికుల పట్ల భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను పరిశీలించి డ్రైవర్లకు పలు భద్రత సూచనలు చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించి వాహనాల నడపడమేనని తెలిపారు. దీనిని నివారించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత రెండు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 2182 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే 535 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన చోటుచేసుకునే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడిన వారిని సంబంధిత న్యాయస్థానం ముందు హాజరు పరిచి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల మార్టూరు, మేదరమెట్ల పోలీస్ స్టేషన్ ల పరిధిలో నిర్వహించిన తనిఖీలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించి వారిపై, వారి యాజమాన్యంపై కేసు నమోదు చేశామని తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం నిత్యం కృషి చేస్తుందన్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గత 4 రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలతో సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. 224 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405/- నగదు జరిమానా విధించడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లాలో ప్రధానంగా ఉన్న జాతీయ రహదారులైనా NH16, 216, నామ్ హైవే ల పై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ తదితర అనేక ప్రదేశాలకు వెళ్ళు వాహనాలు ప్రధానంగా ఈ మార్గాల ద్వారానే ప్రయాణిస్తున్నాయన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులను 5 బృందాలుగా ఏర్పాటు చేసి MVI అధికారులతో కలిసి సంయుక్తంగా ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలలో బస్సులను రోడ్డు పక్కన సురక్షితమైన ప్రదేశంలో నిలిపి బస్సు డ్రైవర్ కు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించడం, బస్సు యొక్క పర్మిషన్, ఫిట్ నెస్, డ్రైవర్ యొక్క లైసెన్స్ సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న వస్తువులు లేకుండా తనిఖీ చేయడం, ఏవైనా అనుకోని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా స్పందించాలో డ్రైవర్లకు, సిబ్బందికి, అదేవిధంగా ప్రయాణికులకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన ప్రయాణికులకు కూడా అవగాహన పెరుగుతుందని డ్రైవర్లు సిబ్బంది కూడా క్రమశిక్షణతో మెలుగుతారని ఇలాంటి కార్యక్రమాలు ఇకముందు కూడా జరుగుతాయని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

 

జిల్లా ఎస్పీ గారు ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడుతూ.., ప్రయాణికులు నగదును చెల్లించి ప్రయాణం చేసేటప్పుడు సౌకర్యంతో పాటుగా రక్షణ పరమైన సౌకర్యాలు కూడా పొందే హక్కు ఉందని ప్రయాణికులు కూడా బస్సు ఎక్కేటప్పుడు అత్యవసర ద్వారం ఎక్కడుంది?, ఎటువంటి జాగ్రత్తలు బస్సు యాజమాన్యం తీసుకుంటున్నారు?, డ్రైవర్ మరియు ఆ బస్సు సిబ్బంది కండిషన్ ఎలా ఉన్నదని కూడా గమనిస్తూ ఉండాలని, ఏదైనా భద్రతాపరమైన లోపం ఉన్న డ్రైవర్ మరియు సిబ్బంది భద్రత విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న, మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారన్న అనుమానం ఉన్న వెంటనే 112 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.