Home బాపట్ల జాబ్ మేళాలో 290కి ఉద్యోగాలు : నైపుణ్యాభివృద్ధి అధికారిణి మాధవి

జాబ్ మేళాలో 290కి ఉద్యోగాలు : నైపుణ్యాభివృద్ధి అధికారిణి మాధవి

8
0

నగరం (DN5 News) : మండలంలో నిర్వహించిన జాబ్ మేళాలో 22 కంపెనీలు పాల్గొనగా 665 మంది హాజరయ్యారు. వారిలో 290 మంది కంపెనీలకు ఎంపికైనట్లు నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారిణి మాధవి తెలిపారు. గురువారం శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.

ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలైన హెటిరో లాబ్స్, జెయింట్ క్లౌడ్ టెక్నాలజీస్, జోయాలుకాస్, గోదావరి ఆంధ్ర ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్టెల్, మాస్టర్ మైండ్స్, టాటా ఎలెక్ట్రానిక్ మొదలైన 22 కంపెనీల ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలేజి కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించటం సంతోషంగా ఉందని తెలిపారు ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించి ఉధ్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ముందు ఉంటుందని అన్నారు. గతంలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యతకు ఒక భరోసా కల్పించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా చేపడుతున్న ఈ జాబ్ మేళాకు, హాజరైన నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానం పొందాలని ఆకాంక్షించారు. జిల్లాలో నిరుద్యోగం లేకుండా చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిచాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రాజారావు, డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ అధికారిణి ఎం మాధవి, యంగ్ ప్రొఫెషనల్ హారిక, కళాశాల సిబ్బంది, నైపుణ్యాభి వృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.