చీరాల : ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అంతర్ కళాశాల క్రాస్ కంట్రీ మెన్ అండ్ ఉమెన్ 10 కిలోమీటర్ల పోటీలలో యార్లగడ్డ అన్నపూర్ణాంభ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఈనెల 18న కర్ణాటకలోని మంగళూరు యూనివర్సిటీలో జరుగు క్రాస్ కంట్రీ మెన్ అండ్ ఉమెన్ పోటీలకు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ తరపున పాల్గొనేందుకు ఎంపికయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్ధిని స్వాతి, శివ దుర్గ, ద్వితీయ సంవత్సరం విద్యార్ధిని దీపిక, లక్ష్మి కుమారి, కె రమ్య, దుర్గ భవాని మహిళా టీంకు ఎంపికయ్యారు. పురుషుల జట్టుకై అమృత డిగ్రీ కాలేజీ విద్యార్ధి వెంకట గోపాలకృష్ణ, చిన్న, భారతి డిగ్రీ కాలేజి విద్యార్ధి మహేష్, విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీ విద్యార్ధులు పి కార్తీక్, కె నాగంజనేయులు, భరత్ కుమార్ ఎంపికయ్యారు. వీరికి యూనివర్సిటీ అబ్జర్వర్‌గా ఒంగోలు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ దేవీ వర ప్రసాద్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఉలవపాడు పిడి జి సాయి సురేష్, కనిగిరి పిడి బి రమేష్ బాబు వ్యవహరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిపిఎం నీలకుమారి, ప్రిన్సిపాల్ అండ్ చైర్మన్ డాక్టర్ మురళీ, ఎంఎస్ఆర్ కోచ్ మద్ధులూరి వేణు విజయవంతంగా నిర్వహించారు. అంతర్ యూనివర్శిటీ జట్టుకు ఎంపికైన విద్యార్ధులను డాక్టర్ ఐ బాబూరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ మురళి, పిడి నీల కుమారి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.