చీరాల : వాడరేవు సముద్ర తీరం వద్దనున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన పౌర్ణమి సందర్భంగా సామూహిక సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రముఖ డాక్టర్ తాడివలస దేవరాజు, బండారు జ్వాల నరసింహం, అర్చక స్వాములు, వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం, సామూహిక సాగర హారతి నిర్వహించారు. గుంటూరు నుండి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంపార్క ప్రముఖ్ కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాగర హారతి నిర్వాహకులు డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శివానుగ్రహంతో ఎంతో విజయవంతంగా ప్రతి పౌర్ణమికి సాగర్ హారతి చీరాల ఓడరేవులో ఎంతో వైభవంగా జరుగుతుందని అన్నారు. త్వరలో మరకత శివ లింగంతో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హిందూ సంఘాలకు, చీరాల శాసన సభ్యులు ఎం ఎం కొండయ్య, పోలీస్ సిబ్బంది, ఓడరేవు పంచాయతీ సిబ్బందికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో పిక్కి నారాయణ, గురవయ్య, రామకృష్ణ, ఓడరేవు టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు, కారంచేటి నగేష్ కుమార్, కార్తీక్ శర్మ, విట వెంకటేశ్, కోటి గోపి యాదవ్, రఘు, అంబటి మారుతి రామ్, వేద శ్రీ, శ్రీనివాస్ వుల్లగంటి, డాక్టర్ సభరి, గుమ్మ బాలాజీ, మల్లికార్జున్ రావు, లక్షమి శ్రీనివాస్, భవాని, శ్రీ మహాలక్ష్మి మహిళా భజన బృందం సభ్యులు, ఓడరేవు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.