Home ప్రకాశం చదువు మనిషిని మహోన్నతున్ని చేస్తుంది

చదువు మనిషిని మహోన్నతున్ని చేస్తుంది

39
0

*చదువు మనిషిని మహోన్నతున్ని చేస్తుంది

మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం :

చదువు మనిషిని మహోన్నతున్ని చేస్తుందని, సమాజంలో అసమానతలు అంటారనితనాన్ని రూపుమాపుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం

ప్రకాశం జిల్లా కొండపి మండలం ముప్పవరం ప్రభుత్వ పాఠశాలలో శనివారం నాడు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ……. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ సన్న బియ్యంతో పౌష్టికాహారాన్ని అందిస్తూ నాణ్యమైన యూనిఫామ్ తో పేదల విద్యకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ లీప్ స్కూల్ విధానంతో దేశంలోనే అత్యధిక ప్రామాణికం గల విద్యను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందిస్తున్నారని కొనియాడారు. ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి విక్టరీ క్రియేట్ చేశారన్నారు. కష్టతరమైన పాఠ్యాంశాలను సరళీకరించి నో బ్యాగ్ డే తో విద్యార్థుల్లో బడికి పోవాలనే ఆలోచనలకు బలమైన పునాదులు వేశారన్నారు. విద్యార్థులకు మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఉండాలని క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చునని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూనే p4 విధానంతో స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తుల ఆర్థిక సహాయంతో ప్రభుత్వ స్కూళ్ల, సమాజాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. ముప్పవరం ప్రభుత్వ పాఠశాలో చదివిన పూర్వ విద్యార్థి శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.