Home బాపట్ల ఎపిఎం హామీతో విఒఎల ఆందోళన విరమణ

ఎపిఎం హామీతో విఒఎల ఆందోళన విరమణ

23
0
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: photo; hw-remosaic: false; touch: (0.9324074, 0.1557309); modeInfo: ; sceneMode: 8; cct_value: 0; AI_Scene: (-1, -1); aec_lux: 314.14374; aec_lux_index: 0; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0; albedo: ; confidence: ; motionLevel: -1; weatherinfo: null; temperature: 34;

పంగులూరు : అక్రమంగా తొలగించిన విఒఎలను, మండల సమైక్య అధ్యక్షురాలిని విధుల్లోకి తీసుకోవాలని గత రెండు రోజులుగా స్థానిక స్త్రీ శక్తి కార్యాలయం ముందు విఒఎలు చేపట్టిన ఆందోళన తాత్కాలికంగా విరమించారు. అక్రమంగా తొలగించబడిన విఒఎలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సోమ, మంగళవారాల్లో ధర్నా చేశారు. సోమవారం రాత్రి మహిళలు కార్యాలయం ముందు నిద్రించారు. మంగళవారం కార్యాలయం ముందు ధర్నా చేయడంతో ఎపిఎం జ్యోతి ప్రసాదు కార్యాలయానికి వచ్చారు. దీంతో సిపిఎం నాయకులు రాయిని వినోద్ బాబు, తలపనేని రామారావు, గుడిపాటి మల్లారెడ్డి, ప్రజా కళాకారుడు నందవరపు జాన్ సాహెబ్ తొలగించబడిన విఒఎలు బండి సావిత్రి దేవి, హేమలత, మీరాభి, మండల సమైక్య అధ్యక్షురాలు నాగలక్ష్మి తదితరులు చర్చలు జరిపారు.

చర్చలో మండల సమైక్య అధ్యక్షురాలు నాగలక్ష్మి సమస్య వెంటనే పరిష్కరిస్తానని, తీర్మానం రాసి సంతకం చేసి బ్యాంకుకు పంపారు. విఒఎల సమస్యను సోమవారంలోపు జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని, వారిని విధుల్లోకి తీసుకోకపోతే కంటెంట్ కోర్టుకు వెళ్ళమని ఎపిఎం చెప్పారు. ఈ సందర్భంగా విఒఎలు మాట్లాడుతూ సోమవారంలోపు సమస్య పరిష్కారమై తమను విధుల్లోకి తీసుకుపోతే సోమవారం నుండి ఆందోళన ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రాయిని వినోద్ బాబు, తలపనేని రామారావు, గుడిపాటి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిన్న ఉద్యోగులను మార్చుతూ వారిపై ప్రతాపం చూపించడం సరైనది కాదని అన్నారు. కోర్టు విఒఎలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేయడం సరైనది కాదని అన్నారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, డ్వాక్రా సంఘాల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు.