చీరాల : ఎన్‌ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయించే గురువు అమరా వీరాంజనేయులు ముంతావారి సెంటర్‌లోని ఎన్‌విఎస్ అండ్ ఎస్‌జెఆర్ ఆర్య వైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఫస్ట్ ఫ్లోర్‌లో లిఫ్ట్ నిర్మాణానికి కళ్యాణ మండపం అధ్యక్షుడు చేబ్రోలు బాబాజిరావుకు పాఠశాల మైదానంలో గురువారం రూ.3.01లక్షలు విలువైన చెక్ అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, గ్రంధి నారాయణమూర్తి, చెన్న నారాయణ, వలివేటి మురళీకృష్ణ, రమేష్, దరియా సాహెబ్, మోహనరావు, రాముడు, శ్రీను, సాంబశివరావు, కృష్ణమూర్తి, ప్రసాద్, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.