Home బాపట్ల అత్యుత్తమ వైద్య సేవలకే సీఎంఆర్ఎఫ్

అత్యుత్తమ వైద్య సేవలకే సీఎంఆర్ఎఫ్

23
0

పర్చూరు : పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన ప్రతి ఒక్కరికి సిఎంఆర్ఎఫ్ అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడుతున్నారని ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మండలంలోని ఇసుకదర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న 40మందికి రూ.35.41లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు టిడిపి నాయకులు చెక్కులు అందజేశారు. కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని చంద్రబాబు మాట ఇచ్చారని, ఆ మాట మేరకు నిస్సహాయ స్థితిలో వైద్యం చేయించుకోలేని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్ఓసిలు (లెటర్ ఆఫ్ క్రెడిట్), వైద్యం చేయించుకున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సిఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని అనేక కుటుంబాలకు ఆసరాగా సిఎంఆర్ఎఫ్ నిలుస్తుందని అన్నారు. ప్రజల కోసం ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.