Home గుంటూరు వేమూరులో వైసిపి నుండి టిడిపిలో చేరిక

వేమూరులో వైసిపి నుండి టిడిపిలో చేరిక

75
0

వేమూరు (Vemuru) : స్థానికంగా జరిగిన టిడిపి, జనసేన విస్థృత సమావేశంలో వేమూరు, జంపని, వరాహపురం గ్రామాల నుండి 150 వైసిపి కుటుంబాలకు చెందినవారు టిడిపిలో చేరారు. ఎన్టీఆర్ ప్రజావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు వీరందరికీ తెలుగుదేశం కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. వైసిపి పాలనలో సిఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి నిరోధక పాలనకు విసుగు చెంది రాష్ట్ర అభివృద్ధి టిడిపితోనే ఉద్యమవుతుందనే దృక్పథంతో వైసిపి వీడి టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. టిడిపి గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబును సిఎంగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆనందబాబు సూచించారు.