Home బాపట్ల ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారించాలి

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారించాలి

81
0

చీరాల : ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వరమే పరిష్కరించాలని శాసన సభ్యులు కొండయ్య అధికారులను ఆదేశించారు. స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పారిశుద్యం వంటి అంశాలపై కమిషనర్ అబ్దుల్ రషీద్‌ను ఆరా తీశారు. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదలకు అవసరమైన పూర్తి పనులు గుర్తించలని అన్నారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటుకు విషయాలపై పూర్తి నివేదిక అందిచాలని అన్నారు. హౌసింగ్ లబ్ధిదారులను గుర్తించాలని గృహనిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. గతంలో ఇళ్ళ నిర్మాణాలు ఎన్ని పూర్తయ్యాయో, ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయో, నూతన లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. సమావేశంలో చీరాల, వేటపాలెం తహశీల్దారులు గోపికృష్ణ, పార్వతి, ఎంపిడిఓలు, మునిసిపల్ టిపిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.