Home బాపట్ల జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక

39
0

పంగులూరు (Panguluru) : ఈనెల 29, 30, 31 తేదీల్లో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీలకు మండలంలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల పీడీలు కె ప్రతిమ, కె మధుమూర్తి సోమవారం తెలిపారు. తమ విద్యార్ధులు నాయపాము శృతి, వెంకటేష్ ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 12 నుండి 14 వరకు జరిగిన యోగాసన స్టేట్ మీట్‌లో నాయపాము శృతి లెగ్గు బ్యాలెన్స్‌లో ఫస్ట్ ప్లేస్, హ్యాండ్ బ్యాలెన్స్‌లో సెకండ్ ప్లేస్ సాధించిందని చెప్పారు. పాఠశాలకు చెందిన మరో విద్యార్థి ఎం వెంకటేష్ ట్రెడిషనల్‌లో సెకండ్ ప్లేస్ సాధించాడని తెలిపారు.