Home బాపట్ల పాముకాటుకు గురైన యువకుణ్ణి కాపాడిన ఎస్‌పి తుషార్ డూడి

పాముకాటుకు గురైన యువకుణ్ణి కాపాడిన ఎస్‌పి తుషార్ డూడి

21
0

కొల్లూరు : మండలంలోని ఆవులువారిపాలెం గ్రామంలో నివాసం ఉండే సారబత్తుని అనిల్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో వరద నీటిలో నడచుకుంటూ గేదెలకు గడ్డి వేయడానికి గడ్డి వాము దగ్గరికి వెళుతుండగా పాము కాటుకి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ తుషార్ డూడి వేగవంతంగా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. పాము కాటుకు గురైన యువకుడిని పడవలో కొల్లూరు లాకులు వద్దకు తీసుకొని వచ్చారు. అక్కడ ఎస్పీ అతడి గాయన్ని పరిశీలించి వెంటనే పోలీసు జీపులో హాస్పటల్‌కు తరలించారు. ఎస్పీ వేగంగా స్పందించడం వల్ల యువకుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.