Illu Illalu Pillalu June 03rd Episode: క్రమశిక్షణ అంటూ తెగ గొప్పలు చెప్పుకున్న రామరాజు ఇంట్లో ప్రళయం మొదలైంది. గుణవతి అయిన కోడల్ని తీసుకొస్తా.. ఈ ఇంటిని కళకళలాడిస్తా అంటూ చివరికి గయ్యాళి గంప కోడలిని తీసుకొచ్చాడు రామరాజు. దాంతో ఆ ఇంట్లో పెంట మొదలైంది. అన్నదమ్ముల మధ్య పెట్టిన చిచ్చు నేటి ఎపిసోడ్‌లో భగ్గుమంది. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్‌లో ఏమైందో చూద్దాం.
పెద్దోడు చందు పెళ్లికి తండ్రికి తెలియకుండా రూ.10 లక్షలు అప్పు చేసి శ్రీవల్లికి ఇస్తాడు. పదే పది రోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పి.. తల్లీ, కూతుళ్లు చందుని బురుడీ కొట్టించారు. అయితే వడ్డీ వ్యాపారి ఆ పది లక్షల అప్పు తిరిగి కట్టాలని నిలదీయడంతో చందు చిక్కుల్లో పడ్డాడు. మీ అమ్మని అడిగి డబ్బు తీసుకుని రమ్మని శ్రీవల్లిని గట్టిగానే అడుగుతాడు చందు. అయితే ఈ పది లక్షల మ్యాటర్.. నర్మద, ప్రేమలకు లీక్ కావడంతో వాళ్లు ఎంక్వైరీ చేస్తున్నారని చందుకి ముడిపెట్టేసింది శ్రీవల్లి. ఇది నిన్నటి ఎపిసోడ్ ముచ్చట కాగా.. ఈరోజు (జూన్ 03) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ఆ నర్మద, ప్రేమ రూ.పది లక్షల విషయాన్ని మీ నాన్నకి చెప్పి మనల్ని దోషిగా పెట్టాలని చూస్తున్నారంటూ శ్రీవల్లి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని భయపడుతుంటాడు చందు. ఇంతలో సాగర్ వచ్చి.. చందు పక్కన కూర్చుని ఏంట్రా అన్నయ్యా ఒక్కడివే కూర్చుని ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఎంత మాట్లాడినా చందు మాట్లాడకపోయేసరికి.. ఏంట్రా అన్నయ్యా… ఏం మాట్లాడవ్ అని అంటాడు సాగర్. దాంతో చందు.. ‘నీకు ఆల్రెడీ చెప్పాను.. నర్మదని మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పమని.. నువ్వు నీ భార్యకి చెప్పలేదా? అని అడుగుతాడు.
నర్మద తప్పు చేయలేదు అన్నయ్యా.. తిరగబడ్డాడయ్యో…
నేను కూడా నీకు చెప్పాను కదన్నయ్యా.. వదిన నర్మద విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే నర్మద రియాక్ట్ అవుతుంది తప్ప.. తనంతట తాను కావాలని చేయడం లేదని చెప్పాను కదా అని అంటాడు సాగర్. ఆ మాటతో చందు.. ‘రేయ్.. నీ భార్యకి చెప్పమని చెప్పినప్పుడు చెప్పు.. అది చేయకుండా ఎదురు ప్రశ్నలు వేసి వితండ వాదం చేస్తావ్ ఏంటి? అని అరుస్తాడు. దాంతో సాగర్.. ‘నర్మద తప్పులేనప్పుడు నేను తనతో ఎలా చెప్తాను అన్నయ్యా’ అని అంటాడు. తప్పులేదని నీ భార్యని సమర్ధిస్తావ్ ఏంట్రా బుద్దిలేకుండా.
నీ పెళ్లం తప్పులేదని సమర్ధిస్తావ్ ఏంట్రా బుద్దిలేకుండా.. ‘అన్నయ్యా’!!
ఈరోజు కూడా నర్మద.. మీ వదిన వాళ్ల చెల్లెల్ని అవమానిస్తూ మాట్లాడిందంట. ఇంటికి వచ్చిన చుట్టాలని అలా అవమానిస్తారా? ఆ ఇంటి అల్లుడిగా నాకు ఎంత అవమానం? నా తమ్ముళ్ల భార్యలు నాకు విలువ లేకుండా చేస్తా.. నేను మా అత్తారింట్లో తలెత్తుకోగలనా? ఇవేవీ ఆలోచించదా నీ భార్య? వెళ్లి నీ భార్యకి చెప్పరా అంటే.. తన తప్పు లేదని సమర్ధిస్తావ్ ఏంటి? వల్లి విషయంలో నర్మద ఎందుకు జోక్యం చేసుకోవాలి? అసలు నర్మద, ప్రేమలకు వల్లి విషయాలు ఎందుకు? వల్లీ విషయంలో ఎందుకు వాళ్లు వేలు పెడుతున్నారు? అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు చందు.
వదిన అందరి పర్సనల్ లైఫ్‌లో వేలుపెట్టేయొచ్చు.. ఆమె విషయాల్లో ఎవరూ వేలు పెట్టకూడదంటావ్.. ఏంట్రా ఇదీ
ఆ మాటల్ని విన్న ధీరజ్.. ‘అసలు నువ్వు ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నావ్ అన్నయ్యా’ అని తగులుకుంటాడు. ‘ఏంట్రా.. ఏమన్నావ్..? నర్మద, ప్రేమల వల్ల నా భార్య బాధపడుతుంది.. మరి అడగకుండా ఎలా ఉంటానురా’ అని అడుగుతాడు చందు. ‘కదా.. మొన్న ప్రేమ విషయంలో కూడా నేను ఇలాగే అడిగాను.. అప్పుడు నువ్వేం అన్నావ్.. ప్రేమ ట్యూషన్ విషయం వదినకి ఏం సంబంధం? వదిన ఎందుకు జోక్యం చేసుకుంటుందని అడిగినప్పుడు వదిన పెద్ద కోడలు కాబట్టి.. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఉందని అన్నావ్. అంటే.. వదని అందరి విషయాల్లోనూ వేలు పెట్టేయొచ్చు. కానీ వదిన విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే తప్పా?
నాపై ప్రతీకారం కోసం ఎదురుచూశావ్.. ‘రేయ్ ఎవడ్రా వీడూ.. ఆ రామరాజు గాడిలాగే మాట్లాడుతున్నాడూ’
వదిన వల్ల ఎవరికైనా బాధ కలగొచ్చు.. కానీ వదినకి మాత్రం ఎవరి వల్లా బాధకలగకూడదు. ఏంటన్నయ్యా ఇది.. ఇదేం న్యాయం? అని ఇచ్చిపడేస్తాడు ధీరజ్. దాంతో చందు.. ‘ఏదో అనుకున్నాను కానీ.. ఇవన్నీ బాగానే మనసులో పెట్టుకున్నావ్ అన్నమాట. ఆరోజు నేను చెప్పిన మాటల్ని అర్థం చేసుకోవచ్చు కదా.. కానీ మనసులో పెట్టుకుని సందర్భం కోసం చూస్తున్నావ్. సందర్భం రాగానే మాటలతో ప్రతీకారం తీర్చుకున్నావ్’ అని అంటాడు. ఆ మాటతో ధీరజ్.. ‘నేను ఏం మాట్లాడుతున్నా.. నువ్వేం మాట్లాడుతున్నావ్.. నీకు ఒక విషయం కరెక్ట్ అని అనిపించినప్పుడు.. అదే అభిప్రాయం ఎదుటి వాళ్లకి కూడా ఉంటుంది కదా?
మీ పెళ్లాలు నా పెళ్లాన్ని వేరుగా చూస్తున్నారు కాబట్టి.. మీరు నన్ను వేరుగా చూస్తున్నార్రా
అది అర్థం చేసుకోవడం మానేసి పగలూ ప్రతీకారాలు అంటావ్ ఏంటి? అని అంటాడు ధీరజ్. దాంతో చందు.. ‘అవునురా.. నేను అర్ధంలేకుండానే మాట్లాడుతున్నా.. పగలూ ప్రతీకారాలంటూ నోటికొచ్చినట్టే మాట్లాడుతున్నా.. అర్ధమైందిరా.. నాకిప్పుడు క్లియర్‌గా అర్ధం అయ్యింది. ప్రేమ, నర్మదలు ఒక్కటి కాబట్టి.. ఇప్పుడు మీరిద్దరూ ఒక్కటయ్యారు. మీ పెళ్లాల ఒక్కటయ్యారు కాబట్టి.. మీరు కూడా ఒక్కటయ్యారన్నమాట. మీ భార్యలు నా భార్యని వేరుగా చూస్తున్నారు కాబట్టి.. మీరు కూడా నన్ను వేరుగా చూస్తున్నారు. సరేరా.. అలాగే చూడండి’ అని అంటాడు. ‘ఏంటన్నయ్యా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావ్? అని ధీరజ్ అడిగేసరికి.. ఊహించుకోవడం కాదు.. ఎవరేంటనేది? ఇప్పుడు తెలిసింది.
మీ భార్యలు రాగానే మీరు మారిపోయార్రా.. ‘ఎవడ్రా మారిందీ’
ఇంతకు ముందు నేనంటే మీకు గౌరవం ఉండేది. నా మాటపై గౌరవం ఉండేది. కానీ మీరు మారిమారిపోయారు. మీ భార్యలు రాగానే మీరు పూర్తిగా మారిపోయారు. ఉండండ్రా.. అలాగే ఉండండి.. నేను నా భార్య మాత్రమే వేరుగా ఉంటామ్ అని అంటాడు చందు. వీడి లత్కోర్ మాటలు విన్న వేదవతి.. ‘రేయ్ ఆపండ్రా’ అని సీన్‌లోకి వస్తుంది. అసలు మీకు బుద్ది ఉందా? ఏం మాట్లాడుతున్నార్రా.. ఎవరినోటి లోనుంచైనా మాట వచ్చిందంటే చెంపలు పగిలిపోతాయ్. ఇంతకు ముందు ఎలా ఉండేవారురా.. రామలక్ష్మణులుగా ఉండే మిమ్మల్ని చూస్తే ఈ అమ్మ గుండె ఆనందంతో పొంగిపోయేది.
ఒట్టువేయండ్రా.. ఏంటీ వేసేదీ.. ఈ దూరం ఎంత దూరం తీసుకెళ్తుందో
కానీ ఇప్పుడు మీరు ఇలా గొడవపడుతుంటే ఈ తల్లి గుండె పగిలిపోతుంది. ఇదే మీకు చివరి గొడవ కావాలి.. ఇంకెప్పుడూ గొడవ పడం అని మాట ఇవ్వండిరా అని అడుగుతుంది వేదవతి. అయితే చందు ఒట్టుపెట్టకుండానే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత ధీరజ్.. ఆ వెంటనే సాగర్‌లు కూడా వెళ్లిపోతారు. దాంతో వేదవతి.. ‘రేయ్.. మీరు ఈ అమ్మ చేతిలో చేయి వేయకుండా వెళ్లిపోతుంటే.. గూడు చెదిరిన పక్షిలా అనిపిస్తుంది. మీ మధ్య మొదలైన దూరం.. ఎంత దూరం తీసుకుని వెళ్తుందోనని భయంగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వేదవతి. అనంతరం రాత్రి అయ్యేసరికి.. కొడుకులు, కోడళ్లు పడుతున్న గొడవల గురించి పెద పిచ్చయ్య రామరాజుతో చర్చించాలని అనుకంటుంది కానీ.. వీడితో చర్చిస్తే గొడవను పెద్దది చేస్తాడు తప్పితే తగ్గించడని చెప్పకుండా ఆగిపోతుంది.
అంతా ఆ అమ్మాయి వల్లేనండీ.. ‘పెద పిచ్చయ్య రియాక్షన్ మామూలుగా లేదుగా’
చెప్పు బుజ్జమ్మా.. అలా ఉన్నావ్ ఏంటి? గట్టిగా అడుగుతాడు రామరాజు. దాంతో వేదవతి.. కోడళ్లు అనవసరంగా మాటలు అనేసుకుంటున్నారు. కొడుకులూ కూడా.. అలాగే ఉన్నారు. అవి భవిష్యత్‌లో సమస్యగా మారతాయేమోనని.. భయంగా ఉందండీ.. ముగ్గురు కొడుకులూ కలిసి మాట్లాడుకోవడం లేదు కూడా.. ప్రతి విషయంలో ఆ అమ్మాయి (శ్రీవల్లి) జోక్యం చేసుకోవడం వల్లే ఇదంతా’ అని అంటుంది వేదవతి. ఆ అమ్మాయి అనగానే.. ‘ఎక్కడ శ్రీవల్లి అని అంటుందో అని.. ఏ అమ్మాయి ఏ అమ్మాయి అని రెచ్చిపోతాడు సైకోమామ రామరాజు. దాంతో వేదవతి.. ఒకరని కాదులెండి.. ముగ్గురూ అలాగే ఉన్నారని కవర్ చేసేస్తుంది. వాళ్లేదో చిన్నపిల్లలు.. పెద్ద కుటుంబంలో ఇలాంటివి సహజం. కొడుకుల గురించి నేను చూసుకుంటా.. కోడళ్ల గురించి నువ్వు చూసుకో.. ఎక్కువ ఆలోచించకు’ అని అంటాడు రామరాజు.