Home బాపట్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి

18
0

చీరాల (Chirala) : మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాద సమయంలో సమాచారం అందించాలని ఈపూరుపాలెం ఎస్‌ఐ శివకుమార్ అన్నారు. మండలంలోని వాడరేవు సముద్ర తీరం నుండి శనివారం ఉదయం ముగ్గురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన సమయంలో సముద్రంలో సూరార సత్య బాబుకు చెందిన ఫైబర్ బోటుకు అడుగు భాగంలో రంద్రం పడింది. గ్రహించిన యజమాని సముద్ర తీరంలో ఆపి ఇతర పడవుల సాయంతో బోటుకు లంగర్ వేసి ఒడ్డుకు చేరారు. అలాగే బోటును బయటకు తెచ్చేందుకు వైజాగ్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి ప్రయత్నించారు. అయితే బోటు 25మీటర్ల లోతులో ఉండడంతో ఫలితం లేదు. దీంతో ఈపురుపాలెం ఎస్‌ఐ శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మత్స్యకారులతో మాట్లాడారు. బోటును ఒడ్డుకు చేర్చేందుకు అధికారులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఎస్ఐ వెంట స్టేషన్ సిబ్బంది, మత్స్యకారులు ఉన్నారు.