Home బాపట్ల మినుము పంట రక్షణకు చర్యలు తీసుకోండి

మినుము పంట రక్షణకు చర్యలు తీసుకోండి

23
0

అద్దంకి : గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మినుము పంటలో అక్కడక్కడ వర్షం నీరు నిలిచి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పంటను రక్షించుకునేందుకు రైతులు చర్యలు తీసుకోవాలని పంగులూరు ఎఒ డి సుబ్బారెడ్డి సూచించారు. మండలంలోని కొండమూరు, రేణింగవరం గ్రామాల్లో మినుము పంటను ఆయన ఆదివారం పరిశీలించారు. పంటలో నిలిచిన నీటిని బయటకు పంపించాలని చెప్పారు. లీటర్ నీటికి రెండు గ్రాములు యూరియా కలిపి పిచికారి చేయాలని చెప్పారు. లేదా పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి నాలుగు గ్రాములు చొప్పున కలిపి పైరుపై వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలని అన్నారు. ప్రత్తి పొలాల్లో నీరు నిల్వ ఉంటే ఆ నీటిని తీసివేయాలని చెప్పారు. పొలం ఆరేవిధంగా చూడాలని చెప్పారు. మల్టీ-కే (13.0.45) 10 గ్రాములు లేదా పోలిఫీడ్ (19:19:19) 10 గ్రాములు లేదా యూరియా 20 గ్రాములు, 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని చెప్పారు. బూస్టర్ దోస్త్ గా 30కిలోల యూరియా, 10కిలోల పొటాష్ ఎకరాకు వేసుకోవాలని అన్నారు. బోరాక్స్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.