Home బాపట్ల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా అరెస్టు

ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా అరెస్టు

43
0

చీరాల : ఉద్యోగాలు ఇప్పిస్తామని, తక్కువ ధరకే బంగారం వస్తుంdని మాయమాట చెప్పి సొమ్ము చేసుకునే ముఠా చేతిలో విలువైన సొమ్ము మోసపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ జగదీష్ నాయక్ అన్నారు. ఉద్యోగం పేరుతో వాటర్ డ్రైవర్ మోసం చేసి రూ.1.50లక్షలు దండుకున్న ముఠాగుట్టును ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈపురుపాలెం స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రెడ్డిపాలెంకు చెందిన ఎన్ పోలిరెడ్డి 10వ తరగతి చదువుకొని ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఐటీసీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఫోన్ చేసి మాయమాటలు చెప్పి ఉద్యోగానికి ముందు రూ.1.50లక్షలు కట్టాలని, మిగిలిన డబ్బులు ఉద్యోగం వచ్చాక కట్టాలంటూ నమ్మబలిగాడు. ఆ మాటలు విని బాధితుడు సరే అనడంతో నగదు తీసుకొని ఓడరేవు రావాలని చెప్పారని, నగదు తీసుకొని వాడరేవు వెళ్లడంతో అక్కడ ఇద్దరు వ్యక్తులు డబ్బు తెచ్చారాని అడుగుతూ ఉండగా మరో నలుగురు వచ్చి దొంగ నోట్లు మారుస్తున్నారా అంటూ బెదిరించి దాడి చేసి డబ్బులతో పరారయ్యారని బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. నెల్లూరు జిల్లా సింగుపేటకు చెందిన గుత్తి భరత్ కుమార్, చీరాల వాడరేవుకు చెందిన రాగిరి శివ మల్లికార్జున్, పాలపర్తి సాయి, బెల్లంకొండ రాము, వెదుళ్లపల్లికి చెందిన పోలా హరీష్, కరీంనగర్‌కు చెందిన కౌశిక్ నిందితులుగా గుర్తిచ్చామని అన్నారు. వీరిలో ప్రధాన నిందితులైన కౌశిక్, పోలా హరీష్ పరారీలో ఉండగా మిగిలిన ముద్దాయిలను ఎస్‌ఐ శివకుమార్ అరెస్టు చేశారని తెలిపారు. వారి వద్ద నుండి రూ.1లక్ష నగదు, నకిలీ కరెన్సీ రూ.500నోట్లు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ పాల్గొన్నారు.