Home బాపట్ల సిఐకి ఆటో యూనియన్ అభినందన

సిఐకి ఆటో యూనియన్ అభినందన

46
0

చీరాల : ఒకటవ పట్టణ సిఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఎం శ్రీనివాసరావును స్థానిక దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు వాసిమల్ల వాసు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఆటో డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని కోరారు. నిర్దేశించిన ప్రదేశాల్లోనే ఆటోలు నిలుపుకుని ప్రయాణికులను ఎక్కించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు మార్పు కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్, సెక్రటరీ మల్లి ఆనంద్, జాయింట్ సెక్రెటరీ డి శ్యాంసన్, ట్రెజరర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.