Home బాపట్ల హాస్టల్‌ విద్యార్ధులకు దుప్పట్లు పంపిణీ

హాస్టల్‌ విద్యార్ధులకు దుప్పట్లు పంపిణీ

16
0

పంగులూరు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండలంలోని ముప్పవరంలో సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక బిసి బాలికల వసతి గృహం, ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థినీ, విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల ఉపాధ్యక్షులు సుందరశెట్టి ఫణీంద్ర, జనసేన నాయకులు సింగరాజు రాంబాబు మాట్లాడుతూ, సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్లారని, ఆయన అడుగుజాడల్లో యువత నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఇంటూరి పూర్ణయ్య, మక్కెన శ్రీనివాసరావు, రాయపూడి స్వామి, రాజేష్ ,నాయుడు, నరేంద్ర, వెంకట్రావు, హనుమాన్, కోటి ,ప్రసాద్ ,అశోక్, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.