Home బాపట్ల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

43
0

చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజిలొ కళాశాల ఐఎస్టిఇ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శ ఉపాధ్యాయుడుగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి చేసిన సేవలను కొనియాడారు. గురు అనే శబ్దానికి అర్ధం అజ్ఞానాన్ని, చీకటిని ప్రాలదోరేవాడని అర్ధం అని తెలిపారు. విద్యార్ధి జీవితాన్ని ప్రేమ, అభిమానాలతో తీర్చి దిద్ది తద్వారా సమాజాన్ని ఉన్నత స్ధాయిలో నిలబెట్టేవాడని తెలిపారు. విద్యార్ధి, ఉపాద్యాయుల బంధాన్ని విడదీయరానిదని తెలిపారు. తల్లి తండ్రుల కన్నా గురవు విద్యార్ధి వ్యక్తిత్వతాన్ని రూపొందింస్తాడని తెలిపారు. ఆధునిక సమాజంలో గురువు ప్రాముఖ్యత గురించి వివరంగా తెలిపారు. విద్యార్ధులను ఆదర్శ పౌరులుగా తీర్చి దిద్దటంలో ఉపాధ్యాయుని పాత్ర మరువలేనిదని తెలిపారు. ఐఎస్టిఇ చాప్టర్ ఇన్చార్జి డాక్టర్ పివిఎస్ శర్మ కన్వీనర్ గా వ్వవహరించారు. కార్యక్రమములో అక్రిడిటేషన్స్ డైరక్టర్ డాక్టర్ సిఎస్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు.